Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కల్యాణ్ ఒక్కరే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇష్ట దైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళుతుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు.
Read Also: CM Revanth Reddy: రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు.. 4 రోజుల్లో మార్గదర్శకాలు
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
రేపు ఉదయం 7గంటలకు హైదరాబాద్ నుంచి కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. రోడ్డు మార్గాన 11గంటలకు కొండగట్టు చేరుకోనున్నారు. కొండగట్టు అంజన్నకు పవన్ కల్యాణ్ మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజలు తర్వాత తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు పవన్ కల్యాణ్. రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30 గంలకు హైదరాబాద్ నివాసానికి రానున్నారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కల్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!