Andhra Pradesh: తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై సీఎంవో ఆరా
- తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో..గెజిట్ విడుదలపై సీఎంవో ఆరా
- సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ చేపడుతున్న సీఎంవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ చేపడుతోంది. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పని చేసే వాళ్లల్లో ఎవరు దీనికి కారకులనే దానిపై సీఎంవో ఆరా తీస్తోంది. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయ శాఖలోని సెక్షన్ ఆఫీసర్ హరి ప్రసాద్ రెడ్డి పాత్రపై వివరాల సేకరణ జరుగుతోంది. ఇద్దరు అధికారుల గత చరిత్రను ఉన్నతాధికారులు తవ్వి తీస్తున్నారు. అధికారులిద్దరూ బిజినెస్ రూల్స్ పాటించారా..? లేదా..? అనే కోణంలో సీఎంవో విచారణ చేపట్టింది.
బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. చివరి ఆరు నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు కాని నిర్ణయాల ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలు సూచిస్తున్నాయి. అమల్లో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరని బిజినెస్ రూల్సులో ఉందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జీవో జారీ చేయడం.. సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ అప్లోడ్ చేయడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో ఇంకా ఎవరైనా కోవర్టులున్నారా అనే కోణంలో ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
Read Also: Minister Satyakumar: ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన ఏపీ మంత్రి సత్యకుమార్
ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) స్థానంలో జీపీఎస్ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి జీవో నంబర్ 54ను జూన్ 12న విడుదల చేశారు. సరిగ్గా అదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. అయితే జీవో విడుదలైన తర్వాత జులై 12వ తేదీన గెజిట్‌లో అప్ లోడ్ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జీపీఎస్ జీవో, గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎంవో విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..