CM Jagan Tour: నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్నారు.
అనంతరం ఎండాడలోని కాపుభవన్, భీమిలి ఫిష్ ల్యాండింగ్ పాయింట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Also Read
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
Read Also: Ambati Rambabu : రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలి
ఇదిలా ఉండగా రేపు (శుక్రవారం) ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లాలోని కావలిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు ముఖ్యమంత్రి జగన్ పట్టాలు పంపిణీ చేయనున్నారు.
తాజావార్తలు
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!