Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Ys Jaganmohan Reddy Review On Health Department

AP CM YS Jagan: మందులు అందడం లేదన్న మాట రోగుల నుంచి రాకూడదు..

Published Date :October 13, 2023 , 5:09 pm
By Mahesh Jakki
AP CM YS Jagan: మందులు అందడం లేదన్న మాట రోగుల నుంచి రాకూడదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ కీలక సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షపై అధికారులు సీఎంకు వివరాలందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,22,69,512 కుటుంబాలను ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా 3,17,65,600 మందిని ఆరోగ్య సిబ్బంది కవర్‌ చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనే కాదు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టను కూడా పెంచుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని అధికారులను సూచించారు. రోగులకు ఇస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. ప్రతి కలెక్టర్‌కూ దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడంతో పాటు కలెక్టర్‌కు మరిన్ని నిధులు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు. హెల్త్‌ క్యాంపులను నిర్వహించడమే కాదు, చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం బాగు అయ్యేంత వరకూ చేయిపట్టుకుని నడిపించాలన్నారు.

Also Read: Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న

సీఎం జగన్‌ అధికారులతో మాట్లాడుతూ.. “అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాత పేషెంట్ల విషయంలో చేయిపట్టుకుని నడిపించాలి . చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉంది, ఇది రెండో అంశం. క్రమం తప్పకుండా వారికి చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య శ్రీలో కవర్‌ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో కూడా వారికి చేయూతను అందించడం అన్నది మూడో బాధ్యత . వీరి బాధ్యతను కూడా తీసుకునేలా ఎస్‌ఓపీని రూపొందించండి :ఆరోగ్య పరంగా, చికిత్సల పరంగా, చెకప్‌ల పరంగా, మందులపరంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ చేయూత ఉండాలి. ప్రతి సచివాలయం వారీగా ఇలా ఎవరెవరు ఉన్నారనేది వివరాలు తీసుకోండి. దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుంది. విలేజ్‌క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లతో దీన్ని అనుసంధానం చేయాలి. అంతే కాకుండా క్రమం తప్పకుండా హెల్త్‌క్యాంపులను నిర్వహించాలి. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి . రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన, విస్తృత ప్రచారం ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి. ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇవ్వాలి.” అని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్‌ చేయాలన్నారు. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందన్నారు. “క్యాంపులకు స్పెషలిస్టులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఎక్కడా కూడా తొందరపాటు లేకుండా రోగులకు మంచి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలి, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలి. దీనికి తగినట్టుగా స్పెషలిస్టులను అందుబాటులో ఉంచేలా చూసుకోవాలి. అలాగే పరీక్షలు చేసేటప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు కూడా చేసి, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ” అని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు.

Also Read: AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను సత్కరించిన వీఆర్‌ఏ సంఘం నాయకులు

ఇప్పటివరకూ 5216 ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సగటున ఒక్కో క్యాంపులో 357 మంది వస్తున్నట్టు వెల్లడించారు. క్యాంపుల ద్వారా దాదాపు 2841 మంది రక్తహీనత ఉన్న బాలికలను గుర్తించామని, వీరికి అన్నిరకాలుగా మందులు, పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించిన వారికి పౌష్టికాహారాన్ని అక్కడే అందించేలా ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పుట్టుకతోనే వివిధ రోగాలతో బాధపడుతున్న వారిని 251 మందిని శిబిరాల్లో గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలని సీఎం సూచనలు చేశారు. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేసేలా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, వారికి అవసరమైన ఖరీదైన మందులు అందించే కార్యక్రమం కూడా జరగాలని సీఎం పేర్కొన్నారు. నాకు మందులు అందడంలేదన్న మాట రోగులనుంచి రాకూడదన్నారు. తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఆస్పత్రుల్లో నాడు – నేడు, కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. అర్భన్‌ హెల్త్‌ క్లినిక్కులు నిర్మాణ పనులను కూడా నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • AP CM YS Jagan
  • AP CM YS Jaganmohan Reddy
  • Health Department
  • telugu news

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions