CM YS Jagan released 5th installment of YSR Vahana Mitra Scheme: ‘వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం’ ఐదో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం బటన్ నొక్కి వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ అయ్యాయి. వాహన మిత్రతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు లబ్ది పొందారు. లబ్ధిదారుల ఖాతాల్లో ఏటా రూ.10 జమ అవుతాయన్న విషయం తెలిసిందే. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకంని సీఎం జగన్ తీసుకొచ్చారు.
ఆటోడ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కా ధరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ సభలో మాట్లాడారు. ‘బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం తీసుకొచ్చాం. వాహనం ఇన్యూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం. ఇవాళ రూ.276 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. వైఎస్‌ఆర్ వాహన మిత్రతో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ది జరుగుతోంది. వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా. ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. ఇది మీ అందరి ప్రభుత్వం’ అని అన్నారు.
Also Read: Nara Lokesh: నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ.. కాసేపట్లో నోటీస్!
‘మీ వాహనాలకు ఇన్స్యూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు ఉంచుకోండి. ఎంతోమంది ప్రయాణికులకు మీరు సేవలందిస్తున్నారు. జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నాం. పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం. అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నాం. వలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశాం. అర్‌బీకేలతో రైతులకు అండగా నిలిచాం. పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశా. మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం’ అన్ని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.