ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు అనగా 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. అయితే, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు అధికారులు..
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ యూనిట్‌ను సీఎం జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు.