Chandrababu Naidu and Nara Lokesh Names in AP CID’s Remand Report: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించించింది. ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆయన పేరును చేర్చారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.
చంద్రబాబు నాయుడిపై రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ సంచలన అభియోగాలు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని, ఆయన ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని పేర్కొంది. ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా.. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. సీఐడీ తరపున వివేకా చారి, వెంకటేష్ న్యాయవాదులు హాజరయ్యారు.
Also Read: Novak Djokovic: మెద్వెదెవ్‌తో ఫైనల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌పై జకోవిచ్ కన్ను!
రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. 409 సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి.