AP CEO MK Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CEO MK Meena: ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు అక్రమ నగదు 203 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగదుతో సహా మద్యం, గంజాయి, విలువైన ఆభరణాలను సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు. సీజ్లకు సంబంధించి 9 వేల కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 10,400లకు పైగా ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ 14 సెగ్మెంట్లల్లో భద్రత కూడా పెంచుతామన్నారు. ఓటర్లకు ఎండతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఎండల కారణంగా తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
Read Also: AP Pensions: ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు.. ఎండలో బ్యాంకుల వద్ద క్యూలు
Also Read
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
హోం ఓటింగ్ కోసం కేవలం 28591 మంది మాత్రమే ఎంచుకున్నారని. మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నారని సీఈవో తెలిపారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఇవాళ నుంచే ప్రారంభమైందని.. ఈ నెల 8వ తేదీతో పూర్తి అవుతుందన్నారు. ఎనిమిదో తేదీలోగానే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాస్ గుర్తును మొత్తంగా 15 చోట్ల మార్చామని చెప్పారు. ఆ 15 స్థానాల్లో స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించామన్నారు. విశాఖలో పార్లమెంట్ పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయని.. మంగళగిరి, తిరుపతి సెగ్మెంట్లల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయన్నారు. 15 వేల బ్యాలెట్ యూనిట్లను అదనంగా తెప్పించామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1500 ఓటర్లకు మించి ఉంటే ఆ పోలింగ్ కేంద్రానికి అనుబంధంగా మరొక పోలింగ్ కేంద్రం(ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం) ఏర్పాటు చేస్తామని సీఈవో వెల్లడించారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదించామని చెప్పారు.
ఏపీ సీఈవో మాట్లాడుతూ.. “పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలీస్ అధికారులకు పంపాం. ఎవరికైనా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటే సెక్యూర్టీ ఇవ్వాలని సూచించాం. 374 మంది అసెంబ్లీ అభ్యర్థులకు.. 64 మంది పార్లమెంట్ అభ్యర్థులకు భద్రత కల్పించాలని పోలీస్ అధికారులు సూచించారు. 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నాం. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎంత మేరకు వచ్చాయనేది ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు. ఎన్నికల విధుల్లో 3.30 లక్షల మంది ఉన్నారు. గోవా, హర్యానా, యానాం, తెలంగాణ నుంచి లిక్కర్ వస్తోంది. గోవా, హర్యానా డీజీపీలతో మేం మాట్లాడాం. లిక్కర్ సరఫరా వెనుక ఒకరిద్దున్నారని తెలిసింది. ప్రతి జిల్లాలో ఎఫ్ఎస్టీ టీంస్ ఉన్నాయి. మద్యం అక్రమాలను అరికడుతున్నాం. ప్రభుత్వ సింబల్ కొన్ని ప్రకటనల్లో వాడుతున్నారు. ఈసీ పర్మిషన్ కోసం వచ్చినప్పుడు బ్లర్ చేసే చూపారు. ఆ తర్వాత ప్రభుత్వ సింబల్ ఉన్న ప్రకటలను తొలగించాలని సూచించాం.” అని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!