AP BRS office: ఏపీలో ప్రారంభమైన బీఆర్ఎస్ ఆఫీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BRS office: ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది.. గుంటూరులోని ఆటోనగర్‌లో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం.. బీజేపీకి దేశంలో ఎదురు గాలి వీస్తోందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బీఆర్ఎస్ వల్లనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాలను అభివృద్ధిలో నడిపించాలనే కేసీఆర్ ఈ పార్టీ పెట్టారని తెలిపారు..
ఏపీ అభివృద్ధి పథంలో వెనుకబడి ఉందని విమర్శించారు తోట చంద్రశేఖర్.. దేశంలో అత్యధిక నిరుద్యోం ఏపీలోనే ఉందన్న ఆయన.. గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు.. నిత్యావసర ధరలు ఏపీలో ఆకాశాన్నంటే విధంగా ఉన్నాయి.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర నుండి మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకు రావటంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు.. తెలంగాణలో కేసీఆర్ మంచి పథకాలను తీసుకు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు..
Also Read
ఏపీలో ఉన్న వనరులు తెలంగాణలో లేవు.. అయినా అభివృద్ధిలో ఆ రాష్ట్రం ముందుందని ప్రశంసించారు తోట చంద్రశేఖర్.. తెలంగాణలో కొన్ని లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చేలా చేశారన్న ఆయన.. ఇక్కడ ఆర్భాటాలు ఎక్కువ ఆచరణ శూన్యం అంటూ విమర్శలు గుప్పించారు.. ఇంత వరకు రాజధాని నిర్మించుకోలేక పోయాం.. పోలవరం ప్రాజెక్టు కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ, ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపణలు గుప్పించారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!