AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్‌తో సభ్యుల హాజరు నమోదు!
- నేటి నుంచి అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్
- ఫేషియల్ రికగ్నిషన్‌తో సభ్యుల హాజరు నమోదు
- రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా డిజిటల్ అటెండెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి హాజరు నమోదు అయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ కొత్త విధానాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రవేశపెట్టారు. ఇకపై సంప్రదాయంగా ఉపయోగిస్తున్న హాజరు రిజిస్టర్ విధానం ఉండదని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ నిన్న విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. సభ్యుల హాజరు వ్యవస్థను పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: YS Jagan: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకానున్న వైఎస్ జగన్!
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకం చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపించాయి. కొందరు సభ్యులు అసెంబ్లీ భవనానికి వచ్చి.. లోపలికి వెళ్లకుండానే సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారనే చర్చ కూడా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు వ్యవస్థ అమలు అసెంబ్లీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధానం ఇతర శాసనసభల్లో కూడా అమలు అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
-
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
-
Bollywood Gossip : నేను ‘గే’ కాదు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!