నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, తణుకులో ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు, విద్యా శాఖలో ఖాళీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, డిస్కంలచే కొనుగోళ్లలో అక్రమాలు, భీమిలీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ-జూనియర్ కళాశాలలు, మనుషుల అక్రమ…