Anushka Sharma Bowling to Virat Kohli: భారతదేశంలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముందు వరసలో ఉంటారు. ఒకరు క్రికెట్ స్టార్, మరొకరు సినీ సెలబ్రిటీ కావడంతో.. ప్రతి ఒక్కరి దృష్టి ఈ జోడీపైనే ఉంటుంది. దాంతో విరుష్క జోడి ఏం చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా కోహ్లీ, అనుష్క కలిసి క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కింగ్ కోహ్లీకే అనుష్క క్రికెట్ రూల్స్ చెప్పడం ఇక్కడ హైలెట్‌గా నిలిచింది.
తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి ‘పుమా’ యాడ్‌లో నటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో ముందుగా అనుష్క రూల్స్ చెబుతుంది. ముందుగా కోహ్లీ బౌలింగ్ చేయగా.. అనుష్క బోల్డ్ అవుతారు. రూల్ నంబర్ 6 ప్రకారం ఇది ట్రయిల్ బాల్ అనగానే.. ఇదేంటి అంటూ విరాట్ ఆశ్చర్యపోతాడు. మరో బంతికి అనుష్క బోల్డ్ అవుతారు. ఆ తర్వాత అనుష్క బౌలింగ్ చేయగా.. విరాట్ భారీ షాట్ ఆడతాడు. బంతి వెళ్లి షెడ్‌పై పడుతుంది. నువ్వే కొట్టావ్ కాబట్టి.. బాల్ నువ్వే తేవాలని అనుష్క అంటారు. చేసేదిలేక విరాట్ బంతికోసం వెళ్తాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా సాగింది.
Also Read: Bajaj vs TVS: టీవీఎస్‌ను దాటేసిన బజాజ్.. అగ్రస్థానంలో ఓలా!
2013లో ఓ షాంపు యాడ్ కోసం చేసిన చిత్రీకరణలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మొదటిసారి కలుసుకున్నారు. యాడ్ చిత్రీకరణలో వీరు స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. 4 ఏళ్లు ప్రేమాయణం సాగించిన విరుష్క జోడి.. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2017 డిసెంబర్ 11న ఇటలీలో పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రేమబంధానికి గుర్తింపుగా వామిక, అకాయ్ ఉన్నారు.