Anu Emmanuel: నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాలోనే తనదైన అందంతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. రాజ్ తరుణ్ సరసన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా చేసింది. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంది. కానీ అక్కడి నుంచే అమ్మడికి కష్టాలు మొదలయ్యాయి. గోపీచంద్ సరసన చేసిన ఆక్సిజన్, పవన్ కల్యాణ్- అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ – నా పేరు సూర్య, నాగ చైతన్య సరసన శైలజారెడ్డి అల్లుడు, బెల్లంకొండ శ్రీనివాస సరసన నా అల్లుడు అదుర్స్, మహా సముద్రం ఇలా అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి.
Read Also: Allu Sneha Arjun: అల్లు అర్జున్ భార్యకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం ఉండదట
అను ఇమ్మాన్యుయేల్ అగ్ర హీరోయిన్‌గా రాణిస్తుందని అంతా ఆశించినప్పటికీ వరుస పరాజయాలతో కెరీర్ డౌన్ ఫాలయ్యింది. ఇప్పుడు అల్లు శిరీష్ సరసన ఊర్వశివో.. రాక్షసివో అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ శిరీష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపైనే అను ఆశలన్నీ పెట్టుకుంది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ విలేకరులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన అను తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘అల్లు అర్జున్ తో వర్క్ చేశారు అలాగే అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు. ఇద్దరిలో క్యూటెస్ట్ ఎవరు..? నాటీ ఎవరు..?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘వేరే ప్రశ్నలేవీ లేవా అడగడానికి..? మంచి ప్రశ్నలు అడగండి’ అంటూ నవ్వుతూనే కౌంటర్ వేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ కు డెంగ్యూ.. జయం రవికి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్
ఇదిలా ఉంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై శిరీష్ స్పందించారు. ఆ వార్తలన్నీ వట్టి పుకార్లనేనని కొట్టిపారేశారు. దీంతో నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టమైంది.