పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా? అనే ప్రశ్న మొదలవుతోంది. వాస్తవానికి.. భారతదేశం, పాకిస్థాన్ మధ్య 3,300 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూ కశ్మీర్‌ను ఆనుకుని ఉన్న సరిహద్దును నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసీ అంటారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లతో సరిహద్దును అంతర్జాతీయ సరిహద్దు (IB) అంటారు.
READ MORE: Central Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. ఏవేవంటే..!
కాగా.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తత మధ్య మే 7న దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్లు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ మే 6-7 రాత్రి, భారతదేశం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ కింద, భారత్ చేపట్టిన వైమానిక దాడిలో చాలా మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ ఉగ్రస్థవరాలతో పాటు పాకిస్థాన్‌లో మరో 12 ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్లు కేంద్రం వద్ద సమాచారం ఉంది. పీఓకే నుంచి పాకిస్థాన్ లోని ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి మరేదైనా ఆపరేషన్ జరుగుతోందా? అనే సందేహం మొదలైంది.
READ MORE: Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు చుక్కలు కనిపించాయి. ఆ దేశం మొత్తం భయాందోళనలతో నిండిపోయింది. ఇంతలో, ఆపరేషన్ సిదూర్ లాంటి మరో ఆపరేషన్ ఏదైనా నిర్వహిస్తున్నారా? అనే భయం పాక్‌ను వెంటాడుతోంది. భారతదేశం ఇప్పటివరకు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే వైమానిక దాడులు నిర్వహించింది. అటువంటి ఉగ్ర స్థావరాలు పాక్‌లో మరో 12 ఉగ్రవాద ఉన్నాయి. వాటిని భారత్ లక్ష్యంగా చేసుకుని మరోసారి దాడులకు పాల్పడుతుందా? అనే భయం మొదలైంది.