అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. నిజానికి స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్త ముందు వెలుగులోకి వచ్చింది. దానికి దీపికా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని కూడా అన్నారు. దీపికా పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి వెళ్లిపోమని కోరారని, దాంతో ఆమె వెళ్లిపోయిందని బయటకు తెలిసింది. అంతేకాదు, అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించిన తృప్తి డిమ్రీ స్పిరిట్‌లో హీరోయిన్ అంటూ సందీప్ రెడ్డి ప్రకటించాడు. అయితే అనూహ్యంగా ఈ వార్తలు వచ్చిన తర్వాత బాలీవుడ్‌లో స్పిరిట్ ఒక ఏ రేటెడ్ సినిమా అని, ఎక్కువగా బోల్డ్ సీన్స్, లిప్ లాక్‌లు ఉండడంతోనే దీపికా నటించలేనని బయటకు వచ్చిందని బాలీవుడ్ మీడియా పోర్టల్స్‌లో ప్రచారం మొదలైంది. దీంతో ఈ విషయం మీద ఫైర్ అవుతూ సందీప్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు.
Also Read:Manchu Vishnu: సుప్రీమ్ కోర్టుకు మంచు విష్ణు
సినిమా కథ చెప్పి మిమ్మల్ని సినిమాలోకి ఆహ్వానించినప్పుడే ఒక సైన్ చేయని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్‌లోకి మీరు అడుగుపెట్టినట్లే, కానీ మీరు ఒక యంగ్ యాక్టర్‌ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా కథ బయటికి చెప్తూన్నారని తెలిసింది. అక్కడే మీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. ఇంకా ఈ ఫేక్ ఫెమినిజం ముసుగుతో ఏం చేయాలనుకుంటున్నారు? సరే, ఈసారి కథ మొత్తం చెప్పండి, నాకు ఏమీ ఫరక్ పడదు అంటూ ఆయన రాసుకొచ్చాడు. అయితే నిజానికి దీపికా పడుకోనే గతంలో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లలేదు. ఆమె పలువురు హీరోలతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వచ్చినా సరే, వాటిని ఖండించలేదు సరికదా, తర్వాత ఒక స్టార్ హీరోని వివాహం చేసుకొని రిలేషన్‌లోకి అడుగు పెట్టింది. ఆమెను వెనకేసుకొస్తూ ఇప్పుడు బాలీవుడ్‌లో ఆర్టికల్స్ రావడంతో దాన్ని పిఆర్ స్టంట్ అంటూ సందీప్ రెడ్డి వంగాతో సహా చాలామంది అభివర్ణిస్తున్నారు.
Also Read:Naga Vamsi: టీడీపీకి 25 లక్షల విరాళం..
అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనే ప్రస్తావన వస్తే, ఎవరిదీ అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నిజానికి ఒక్కో సినిమాలో ముందు ఎంపికైన వారు తర్వాత నటించలేక తప్పుకోవాల్సి రావచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో జరిగాయి. కానీ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చిన వారు ఎవరూ సినిమా మీద ఇలాంటి విషపు ప్రచారాలు చేయించలేదు. కానీ మొదటిసారి దీపికా పడుకోని తాను తప్పుకున్న సినిమా మీద విషం చిందించే ప్రయత్నం చేయడం చాలా దారుణం కదా? ఆమె చేసింది సరే. ఆమెను బహిరంగంగా టార్గెట్ చేస్తూ సందీప్ రెడ్డి కూడా ట్వీట్ చేయాల్సిన పరిస్థితి కూడా బాలేదు. ఇలా చేయడం వల్ల ఆమె మీద సింపతీ కారణంగా సినిమ కొంత ఎఫెక్ట్ పడవచ్చు. అలా అని నిజంగా దీపిక బయటకు వచ్చి సినిమాని బాయ్‌కాట్ చేయమని ఆమె అభిమానులను కోరినా సినిమాకి ఫరక్ పడదు. కానీ ఇప్పటికే ఆల్ఫా మేల్ అంటూ సమాజంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి వంగా ఇమేజ్ మరికొంత డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.