కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న అవార్డులు గురువారం ప్రకటించింది. నలుగురికి ఖేల్‌రత్న అవార్డులు ఇవ్వనుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, షూటింగ్‌లో ఒలింపిక్స్ పతక విజేత మనుభాకర్‌లకూ కేంద్రం ఈ అవార్డులు ప్రకటిచింది. ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రతి ఏటా జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మక అవార్డులను బహుకరించారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమల్ అందుకోగా.. అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు.