తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చిత్రం వావాతియార్. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను అన్నగారు వస్తారు పేరుతో తీసుకువస్తున్నారు. నిథిలిన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. వా వాతియార్‌ను గతంలో డిసెంబర్ 5న తీసుకు వస్తున్నట్లుగతంలో ఎనౌన్స్ చేశారు మేకర్స్.
Also Read : Parasakthi : శివకార్తీకేయన్ ‘పరాశక్తి’ ఓవర్సీస్ రివ్యూ..
కానీ ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబరు 12న రిలీజ్ అని మరొక డేట్ వేశారు. అందుకు తగ్గట్టు హీరో కార్తీ తెలుగులో ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు. రిలీజ్ కు కేవలం కొన్ని గంటల ముందు మరోసారి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఇక ఆ తర్వాత గతేడాది డిసెంబరు 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించి మళ్ళి వాయిదా వేశారు. దాంతో ఇక ఈ సినిమా రిలీజ్ కావడం జరగదు అనే టాక్ వినిపించింది. అయితే ఇటీవల విజయ్ నటించిన జననాయగన్ సెన్సార్ ఇస్స్యూస్ తో వాయిదా పడింది. దాంతో ఇప్పుడు సడన్ గా రంగంలోకి దిగాడు అన్నగారు. సంక్రాంతి కానుకా జనవరి 14న థియేటర్స్ లో రిలిజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అనేక సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్ గా సంక్రాంతి బరిలోకి వస్తున్నాడు అన్నగారు.