Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Anna Hazare Key Comments On Kejriwal Clean Chit In Liquor Case

Anna Hazare: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు

Published Date :February 28, 2026 , 11:45 am
By Suresh Maddala
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ క్లీన్‌చిట్
  • కోర్టు తీర్పుపై స్పందించిన అన్నాహజారే
  • మీడియా ముఖంగా కేజ్రీవాల్‌కు కీలక సూచన
Anna Hazare: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా మరో 21 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశంపై అన్నా హజారే స్పందించారు. న్యాయవ్యవస్థ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. తీర్పును స్వాగతిస్తున్నామని… న్యాయవ్యవస్థ అత్యున్నతమైనది కాబట్టి తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు.

‘‘మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తుంది. దేశంలో న్యాయ వ్యవస్థ అత్యున్నత వ్యవస్థ. మనది అనేక రాజకీయ పార్టీలు, కులాలు, మతాలతో కూడిన పెద్ద దేశం. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ కారణంగా అది సరిగ్గా నడుస్తోంది.’’ అని అన్నా హజారే మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగాన్ సిద్ధిలో మాట్లాడారు.

కేజ్రీవాల్ కు ఇప్పుడు ఏమి సలహా ఇవ్వాలనుకుంటున్నారని అడిగినప్పుడు.. ‘‘సమాజం కోసం… దేశం కోసం పని చేయండి. మీ గురించి లేదా పార్టీ గురించి ఆలోచించకండి..’’ అని సూచించారు. బలమైన జన లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2011లో జరిగిన ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ ఉద్యమంలో హజారే, కేజ్రీవాల్, సిసోడియా కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఆ ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసింది.

ఢిల్లీ పాలసీ కేసులో మార్చి 21, 2024న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 155 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. జైల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగి.. విడుదలయ్యాక రాజీనామా చేశారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక అన్నా హజారే మాట్లాడుతూ.. జన్ లోక్‌పాల్ ఉద్యమంలో భాగమైన వ్యక్తిని అవినీతి కేసులో అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేజ్రీవాల్ కోట్లాది మంది దేశవాసుల నమ్మకాన్ని మోసం చేశారని, రాజకీయ ఆశయాలు 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నాశనం చేశాయని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో.. మృత శిశువుకు జన్మనిచ్చిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిని

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anna hazare
  • Kejriwal clean chit
  • Liquor Case

తాజావార్తలు

  • Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..

  • H-CITI Project: 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లు.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనున్న కేబిఆర్ పార్క్ జంక్షన్..

  • VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!

  • Vishnu Vinyasam: విష్ణు విన్యాసం లీక్.. బిగ్ మిస్టరీ

  • London: లండన్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

ట్రెండింగ్‌

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?

  • Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..

  • Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!

  • Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions