Animal : యానిమల్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ రెడ్డి సినిమాతో ఇటు తెలుగు లో అటు బాలీవుడ్ లోను అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యం లోనే ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 21 నిమిషాలని సమాచారం.. అదే నిజమైతే ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక నిడివి ఉన్న బాలీవుడ్ చిత్రం ఇదే కానుంది.
2016లో వచ్చిన ‘ధోనీ’ సినిమా (రన్‌టైన్ 3.10) తర్వాత 3 గంటలకు పైగా రన్ టైమ్ హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. నిజానికి ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ను థియేటర్‌లకు కట్టిపడేయడం ఎంతో కష్టం తో కూడుకున్న పని.. అయితే బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.ఈ సినిమా టెర్రిఫిక్‌గా ఉందని, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టుకుండా ఉంటుందని వినిపిస్తుంది.ఇంత లెంగ్తీ రన్‌టైమ్ అంటే మల్టిప్లెక్స్ థియేటర్‌లకు మాత్రం పెద్దదెబ్బే అని చెప్పాలి… ఎప్పటిలా కాకుండాకాస్త త్వరగానే షో లు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెద్ద సినిమాలకు ఆరు షోల వరకు చాన్స్ ఉంటే.. యానిమల్ సినిమాకు మాత్రం కేవలం ఐదు షోలు మాత్రమే వేసుకునే చాన్స్ ఉంటుంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో కూడా టైమింగ్స్ మారే చాన్స్ అయితే వుంది.అయితే మేకర్స్ అధికారికంగా అయితే ప్రకటించలేదు..ఈ వార్తలో నిజమెంతుందో తెలియాంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..