ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. నీటిశాతం ఎక్కువగా ఉండే కాయలను తీసుకోవడంతో పాటుగా సమయానికి తీసుకోవాలి.. నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.. అయితే ఎండాకాలంలో బెల్లం తీసుకుంటే వేడి అని కొందరు నమ్ముతారు.. కానీ నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే రోజుకు ఒక ముక్క బెల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. కొందరు బెల్లంను టీలో వేసుకొని తాగుతారు.. మరికొంత మంది బెల్లంను నీళ్లలో కలుపుకొని తాగుతారు.. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. రక్త హీనత సమస్య నుంచి బయట పడేస్తుంది.. రక్తంలో హేమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది..
జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుందట. మనం తిన్న ఆహారం వెనువెంటనే జీర్ణం అవుతూ ఉంటుంది.. అంతేకాదు గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి.. అలాగే బాడీ పెయిన్స్ రాకుండా కూడా సహాయపడుతుందట. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుందట. గుండె పని తీరును మెరుగు పరుస్తుంది.. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు కూడా బెల్లంను తీసుకుంటే మంచిదే.. వేడిని తగ్గిస్తుంది.. రోజు ఒక చిన్న ముక్క ను తీసుకోవడం అలవాటు చేసుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.