High Court: ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? ప్రశ్నించిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? అంటూ ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆర్-5 జోన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు లాయర్లు.. పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? అంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. ఇక, తాము ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామంటూ పిటిషన్లోనే పేర్కొన్నామన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టు వివరించారు.. ఇళ్ల నిర్మాణంపై తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజాధనం వృధా అవుతుంది కదా? అని వ్యాఖ్యానించింది హైకోర్టు.. ఇక, లంచ్ తర్వాత కూడా ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై వాదనలు కొనసాగనున్నాయి.
Read Also: Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్
Also Read
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
కాగా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై దాఖలైన రిట్ పిటిషన్లపై ఈ నెల 17న విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు.. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు యు.దుర్గాప్రసాద్, వి.జ్యోతిర్మయిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.. అనంతరం తదుపరి విచారణ చేపట్టేందుకు కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది.. ఇక, సోమవారం రోజు హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున లాయర్ ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. భూమి బదలాయింపు సీఆర్డీఏకు పూర్తిగా జరగలేదన్నారు. అనుబంధ ఒప్పందంలో ఎవరికి ఏ భూమి అనేది ఇంకా తేలలేదని, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తేనే.. ఒప్పందం పూర్తవుతుందని లాయర్ మురళీధర్ కోర్టుకు తెలిపారు. మరి.. ఈ రోజు ఇంకా ఎలాంటి వాదనలు కొనసాగుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!