AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన
- ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ల పదవీకాలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన మరుసటి రోజు నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారి, పర్సన్-ఇన్-ఛార్జ్ లేదా పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరాన్ని బట్టి ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని లేదా పలు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక అధికారిని నియమించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వబడింది.
Also Read
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- E20 Petrol: E20 పెట్రోల్‌పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
- Bhojshala Case: భోజ్‌శాలలో నమాజ్‌కు అనుమతి లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Also Read: IPL 2026-SRH Schedule: ఆర్సీబీతో తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!
ఈ పదవులకు తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, డిప్యూటీ ఎంపీడీవో లేదా అంతకంటే ఉన్నత హోదా కలిగిన అధికారులను నియమించాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారాలను వినియోగిస్తూ విధులు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారికంగా జారీ చేశారు.
తాజావార్తలు
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!