Bhojshala Case: భోజ్‌శాలలో నమాజ్‌కు అనుమతి లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భోజ్‌శాలలో శుక్రవారం నమాజ్ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు నిరాకరణ.
- సమీపంలోని బహిరంగ ప్రదేశంలో నమాజ్‌కు అనుమతి.
- కోర్టు అనుమతి లేకుండా నిర్మాణ మార్పులు చేయొద్దని ASIకి ఆదేశం.
- భోజ్‌శాల వివాదంపై రోజువారీ విచారణకు సిద్ధమన్న సుప్రీంకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhojshala Case: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున భోజ్‌శాల ప్రాంగణంలో నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు వారికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య నమాజ్ చేసుకునేందుకు భోజ్‌శాల సమీపంలో ఓ బహిరంగ ప్రదేశాన్ని అందుబాటులో ఉంచాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు సున్నితమైంది కావడంతో హిందూ, మస్లిం పక్షాలు సహనం పాటించాలని సూచించింది. అయితే, ఈ సమస్యపై రోజూవారీ విచారణ నిర్వహించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
మే నెలలో మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్‌శాల దేవాలయమే అంటూ సంచలన తీర్పు చెప్పింది. దశాబ్ధాలుగా ఉన్న వివాదానికి చెక్ పెట్టింది. అయితే, హైకోర్టు దేశాలను సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఇచ్చిన శుక్రవారం నమాజ్ అనుమతిని రద్దు చేుసింది. తాజాగా సుప్రీం తీర్పులో, కోర్టు అనుమతి లేకుండా భోజ్‌శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణ పనులు, మార్పులు చేయకూడదని ఏఎస్ఐని ఆదేశించింది.
Also Read
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!