YS Jagan: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇలా స్పందించిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీ ఇలా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.. ఈ ప్రారంభోత్సవం ప్రధాని చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలని ప్రధాన డిమాండ్‌గా ఉంది.. అయితే, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపిన ఆయన.. ఈ సమయంలో విపక్షాల తీరును తప్పుబట్టారు.
Read Also: Off The Record: టీడీపీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ పోటీ
Also Read
సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్ విషయానికి వస్తే.. ‘‘పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేవాలయం.. అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు.. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని పొలిటికల్ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నా.. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుంది’’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, కేంద్ర ఆహ్వానం మేరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజూజనతా దళ్(బీజేడీ), అకాలీదళ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు.. విపక్షాల బహిష్కరణపై బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్(ఎన్డీయే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య గౌరవం కలిగించేది కాదని, ఇది మన గొప్పదేశ ప్రజాస్వామ్య నీతి, రాజ్యంగ విలువకు అవమానం అని పేర్కొంది. ప్రతిపక్షాల చర్యలను మేధోపరమైన దివాళాగా అభివర్ణించింది. ప్రజాస్వామ్యానికి ధిక్కారంగా, ద్రోహంగా పేర్కొంది.
I congratulate @narendramodi ji for dedicating the grand, majestic and spacious Parliament building to the nation. Parliament, being the temple of democracy, reflects our nation's soul and belongs to the people of our country and all the political parties. Boycotting such an…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2023
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!