SIPB: సీఎం చంద్రబాబు మార్గదర్శంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్తగా రూ.20,216 కోట్ల విలువైన నాలుగు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. దీంతో దాదాపు 50,600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తొమ్మిదవ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్, సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఎఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సంస్థలు డిజిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రెసిడెన్షియల్, సేవల రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని SIPB ప్రకటించింది.
Mrunal Thakur : అమ్మని కావాలనుంది.. కానీ – మృణాళ్ ఎమోషనల్
ఈ సమావేశం అనంతరం అందిన నివేదిక ప్రకారం.. సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండగా.. మొదటి దశలో రూ.1,466 కోట్లు, రెండో దశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ డేటా, డిజిటల్ సేవల రంగంలో కీలక పురోగతి సాధిస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అలాగే, సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,500 కోట్లతో విశాఖపట్నం, మధురవాడ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టనుంది. ఈ అంశం రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కొత్త ఊపును తీసుకరానుంది.
మరోవైపు, బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,250 కోట్లతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును ప్లాన్ చేయనుంది. దిహినితో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విస్తరణకు కీలకంగా మారనుంది. అలాగే, ఎఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ ఏకంగా రూ.1,000 కోట్లతో విశాఖపట్నం, మధురవాడలో సేవల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి సేవల రంగాన్ని ముందుకు తీసుకపోనున్నాయి.
IND vs ENG: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్‌కు పిలుపు.. ఇషాన్ కిషన్‌ను ఏమైంది?!
ఇప్పటి వరకు SIPB ద్వారా మొత్తం 113 ప్రాజెక్టులకు సంబంధించి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇవి రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాలు పెంచుతున్నాయని పేర్కొంది. ఇది ఇలా ఉండగా.. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన ఉండవల్లి నివాసంలో నివహించిన సమీక్షా సమావేశంలో.. మంగళగిరిని ఐటీ, ఐటీయేతర పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. దీని ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చంద్రబాబు, లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు, ఉద్యోగ సృష్టికి, పరిశ్రమల వృద్ధికి కేంద్రంగా ముందుకు వెళ్తోంది.