Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talliki Vandanam Scheme: కొత్త విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుతున్న అర్హ విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. పథకం అమలుకు మొత్తం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేయగా, రూ.10,049 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నెల 24న అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు, 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు లబ్ధి పొందనున్నారు. ప్రతి అర్హ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఒక్కో విద్యార్థికి రూ.2 వేల చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం మినహాయించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 22న తొలి విడతగా 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన అర్హులు, అనర్హుల జాబితాలను ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. అనంతరం ఆగస్టు 4 నుంచి 10 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
ఇక, ఆగస్టు 25 వరకు ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 30న అదనపు అర్హుల జాబితాను విడుదల చేసి, అదే రోజు వారికి కూడా ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ మినహా మిగిలిన మొత్తాన్ని ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లించనుంది. విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించి, విద్యను మరింత ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!