AP School Kits: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.830.04 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా పరమైన అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యాసంవత్సరంలో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లను “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” పేరిట పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.…