Drugs Mafia: రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను కొలిమిలో తగలబెట్టిన పోలీసులు.. ఎందుకంటే?
- 222 ప్లాస్టిక్ సంచులలో మత్తుపదార్థాలు.
- బారన్ ద్వీపం దగ్గర పట్టుకున్న నేవీ.
- రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను కొలిమిలో తగలబెట్టిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Mafia: ప్రపంచంలోని ప్రతి దేశంలో డ్రగ్స్ వాడకం ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది. ఇక అత్యంత ఎక్కువ జనాభ ఉన్న దేశాలలో భారత్ ఒకటి. దింతో భారత్ లో ప్రమాదకరమైన డ్రగ్స్ ను అమ్మెందుకు డ్రగ్స్ డీలర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ ను nనివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇకపోతే తాజాగా అండమాన్ నికోబార్ రాజధాని శ్రీ విజయపురంలో పోలీసులు రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ని కొలిమిలో తగులబెట్టారు. అయితే ఇలా డ్రగ్స్ ని కొలిమిలో కాల్చడానికి గల కారణాన్ని తెలుపుతూ.. ఈ డ్రగ్స్ చాలా ప్రమాదకరమైనవని, వాటిని బహిరంగ ప్రదేశాల్లో కాల్చలేమని పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల సరుకు దేశంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల మొత్తంగా ఉంది. ఈ చర్యకు డీజీపీ ధాలివాల్ స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్ ను నాశనం చేయడానికి ఇదే ఏకైక మార్గం అని ఆయన పేర్కొన్నారు.
Also Read: Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్‌ను రిసీవ్ చేసుకున్నా..
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
బహిరంగ ప్రదేశంలో కాల్చినా, గుంతలో పూడ్చినా కాలుష్యం ఎక్కువగా వస్తుందని.. అలా చేయడం వల్ల దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సివిల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అండమాన్-నికోబార్ పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర దాదాపు రూ.36 వేల కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వీటికి సంబంధించిన ఆరుగురు విదేశీ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
#WATCH | Port Blair, Andaman & Nicobar | On the destruction of drugs worth Rs 36000 crore seized by police in Sri Vijayapuram, DGP Hargobinder Singh Dhaliwal said, "…Andaman and Nicobar Police have started destroying India's largest drug seizure of over 6000 kg. Incineration is… pic.twitter.com/ps6FeanRJn
— ANI (@ANI) January 12, 2025
పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 36000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేయడంపై డీజీపీ హరగోబిందర్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ.. అండమాన్ అండ్ నికోబార్ పోలీసులు 6000 కిలోల కంటే ఎక్కువ విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసుకున్నారని, 222 ప్లాస్టిక్ సంచులలో ఈ మత్తుపదార్థాలను సముద్రంలో తీసుకెళ్తున్న సమయంలో బారన్ ద్వీపం దగ్గర నేవీ వారిని పట్టుకుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వాధీనం అని అన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖతో పాటు స్థానిక అధికారుల సహకారంతో అతి తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తం డ్రగ్స్ ను ధ్వంసం చేయగలిగామని చెప్పారు.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?