Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నెటిజన్లతో పలు విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వీటితోపాటు., సృజనాత్మకత, ప్రతిభను ఎక్కడున్నా ప్రోత్సహించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే తాజాగా అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సహాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడలిని రక్షించిన 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చాడు.
Also Read: Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదేశం..
Also Read
“ఈ సాంకేతిక యుగంలో మనముందున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే.. మనం టెక్నాలజీకి బానిసలుగా మారతామా లేక యజమానులుగా మిగిలిపోతామా.. కానీ, ఈ అమ్మాయి సమయస్ఫూర్తి చూస్తుంటే టెక్నాలజీ ఎప్పుడూ మనిషి ఆదేశాలను పాటిస్తుందనే ఆశ కలుగుతుంది. అమ్మాయి ప్రవర్తన ఆశ్చర్యంగా ఉంది. తన చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంది, ఇందుకుగాను మహీంద్రా రైజ్ లో చేరాల్సిందిగా ఆమెను ఆహ్వానిస్తున్నాం.,’ అంటూ పోస్ట్ చేసాడు.
మహీంద్రా పోస్ట్ వైరల్ కావడంతో., నెటిజన్లు ఈ నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మేం టెక్నాలజీలో మాస్టర్స్ అవుతాం’ అంటుండగా. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఆలోచన అద్భుతం.. నేటి తరం తెలివితేటలు మన ఊహకు అందనివి అంటూ పేర్కొన్నాడు.
Also Read: Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..
ఇకపోతే ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన నికిత అనే బాలిక తన మేనకోడలు వామిక తో ఆడుతుండగా కోతుల గుంపు వారి ఇంట్లోకి ప్రవేశించింది. కోతులు ఇంటిలోని పాత్రలను విసిరి బీభత్సం సృష్టించాయి. వామిక దగ్గరికి ఒక కోతి వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులెవరూ చుట్టుపక్కల లేకపోయినా బాలిక భయపడలేదు. సమయానుకూలంగా ఆలోచించడంతో, ఇంట్లో వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను చూడగా.. వెంటనే ఆ అమ్మాయి.. ‘‘అలెక్సా.. కుక్కలా మొరుగు’’ అని ఆదేశించింది. దాంతో వెంటనే, అలెక్సా కుక్క మొరిగినట్లు పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభించింది. కోతులు భయపడి అక్కడి నుంచి పారిపోయాయి.
The dominant question of our era is whether we will become slaves or masters of technology.
The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity.
Her quick thinking was extraordinary.
What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK
— anand mahindra (@anandmahindra) April 6, 2024
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!