Anam Venkata Ramana Reddy : అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు. జగన్ …ఆదానీల రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి చేయలేదని జగన్ అంటున్నాడని, తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలుని అమెరికా కు పంపు అని ఆయన అన్నారు. రూ.1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నావని ఎఫ్. బి.ఐ. చెబుతోందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అవినీతి కుంపటని టీడీపీ ఎప్పుడో చెప్పిందని, సోలార్ విద్యుత్ ను యూనిటకు 11 రూపాయలకు కొన్నారు… టెక్నాలజీ మారే కొద్దీ ధరలు తగ్గుతూ వచ్చాయని, 9 వేల మెగావాట్లకి 1750 కోట్లు సరే… ఇంకా అనేక సోలార్ సంస్థలకు పీపీఏ లు చేశారు… వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నారో బయటకి తీయాలని ఆయన అన్నారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ. 20 వేల కోట్ల రూపాయల లంచం జగన్ కు ముట్టిందని ఆనం ఆరోపించారు.
అంతేకాకుండా..’టీటీడీకి అన్యాయం చేసాడు… అందుకే ఆ స్వామి అమెరికా లో కేసు పెట్టించాడు… ఇక్కడ చట్టాలు మాదిరిగా అక్కడ ఉండదు… 6 నెలల్లో తీర్పు వస్తుంది… అపారమైన జ్ఞానం కలిగిన రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది… ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి…. త్వరగా జగన్ ను లాక్కెళ్లాలి.. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శునకానందం పొందాడు…. అందుకే దేవుడు సరైన శిక్ష వేయబోతున్నాడు… ఈ అభియోగాలు తేలేవరకు జగన్ వైసీపీ అధ్యక్షుడుగా దిగిపోవాలి… జగన్ కేసులకి 11 ఏళ్ళు అయ్యింది… సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చొరవ తీసుకుని కేసుల వ్యవహారంలో వేగం పెంచాలి…’ అని ఆనం వెంకట రమణ రెడ్డి వ్యాఖ్యానించారు.