మాములుగా భార్య భర్తలంటే అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉంటు జీవితంలో ముందుకు సాగిపోతుంటారు. ఇక ఏదైనా మనస్పర్థలు వచ్చి అవి ఎంతకి తెగకుంటే గానీ కోర్టు వరకు రారు. కానీ ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల పొట్లాట లతో విడిపోయే వారు ఎంతో మంది ఉన్నారు. భార్యభర్తలు విడిపో వాలంటే చాలా కారణాలు ఉంటాయి. కానీ ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కయ్యాడు. దాంతో అతను విడాకుల కోసం ఫ్యామిలి కోర్టును ఆశ్రయించాడు.కోర్టులో అతడి కారణం విన్న జడ్జి సైతం షాక్ అయ్యాడు.
అసలు కథ ఏంటీ..?
ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తికి కొన్ని రోజుల కిందట ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. రోజు చాటింగ్ చేసుకుంటు ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ఫొటోల్లోని ఆ అమ్మాయిని చూసి అతడు ఇష్టపడ్డాడు. డేటింగ్‌కు కూడా వెళ్లాడు. పెళ్లంటూ చేసుకుంటే ఇలాం టి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు. చివరగా ఆ అమ్మాయి ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన మరుసటి రోజే ఆమె అసలు అందం చూసి అవాక్కయ్యాడు. మేకప్ లేకుండా ఆమెను దగ్గర నుంచి చూసి జడుసుకున్నాడు. మేకప్ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెల రోజలు ఎదురు చూశాడు. అయినా ఇక ఫలితం లేదని తనతో కలిసి ఉండలేనని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.