బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) వేదికపై.. మరోసారి భావోద్వేగానికి లోనై, ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించారు. గత 25 ఏళ్లుగా ఈ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న బిగ్ బీ, సీజన్ 17 గ్రాండ్ ఫినాలే సందర్భంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే కేటాయించానని, సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం హోస్ట్‌గా ఉండటం తన అదృష్టమని ఆయన ఎంతో ఆవేదన వ్యాక్తం చేశారు.
Also Read : Gandhi Talks: విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’.. టీజర్ రిలీజ్
17 సీజన్లుగా అమితాబ్ చూపించిన ఆత్మీయత, ప్రోత్సాహమే ఈ షోకు ఊపిరిగా నిలిచాయి. అయితే ఈ ఫినాలేలో ఆయన ఇంతలా ఎమోషనల్ అవ్వడంతో, కేబీసీకి ఇదే చివరి సీజనా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అగస్త్య నంద సందడి, కికు శారదా కామెడీ మరియు బిగ్ బీ ప్రత్యేక సంగీత ప్రదర్శనతో ఈ ముగింపు ఎపిసోడ్ భావోద్వేగాల పండుగలా సాగనుంది. ఈ అద్భుత ప్రయాణం ఇక్కడితో ముగుస్తుందా లేక మరో సీజన్‌తో మళ్ళీ మొదలవుతుందా అనేది తెలియాలంటే ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.