Guinness world records: సినిమాలంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. అయితే ఆ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల సినిమాలు చూస్తారు, మరికొందరు తమ నచ్చిన హీరో హీరోయిన్ల సినిమాలే చూస్తారు. ఇంకొందరైతే ప్రాంతీయత, భాష తేడాలు లేకుండా అన్ని సినిమాలు చూస్తారు. ఇక అలానే తన సినిమా పిచ్చితో ఓ వ్యక్తి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన ఓ యువకుడు ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
Also Read: RishiSunak: అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్న ఆ దేశ ప్రధాని, ఆయన భార్య
అమెరికాకు చెందిన జాక్ అనే వ్యక్తి ఏడాదిలో ఏకంగా777 సినిమాలు చూసి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నాడు. అంతకు ముందు ఫ్రాన్స్ కు చెందిన విన్సెంట్ క్రాన్ అనే వ్యక్తి పేరిట ఈ రికార్డు ఉండేది. 2018 ఇతను ఏడాదికి 717 సినిమాలు చూసి ఈ రికార్డుడు నెలకొల్పాడు. తాజాగా దానిని జాక్ బద్దలు కొట్టాడు. అంటే జాక్ సగటున రోజుకు మూడు సినిమాల వరకు చూశాడు. అయితే ఈ రికార్డు కోసం 2022 జూలై నుంచి సినిమాలు చూడటం మొదలుపెట్టి, ఈ ఏడాది జూలై నాటికి మొత్తం 777 సినిమాలను చూడటం పూర్తిచేసి రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అయితే తనకి ఎప్పటి నుంచో సినిమాలు చూడటమంటే చాలా ఇష్టమని చెప్పిన జాక్ ఏడాదికి సగటున 150 సినిమాలు చూసేవాడినని చెప్పాడు. అయితే ఇప్పుడు రికార్డు కోసమే అన్ని సినిమాలు చూసినట్లు పేర్కొన్నాడు. అయితే ఇలా సినిమాలను అతను ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోనో చూడలేదు. సినిమా థియేటర్ కు వెళ్లే చూశాడు. అందులోనూ రీగల్ సినిమా హాల్ లోనే అన్ని సినిమాను చూశాను.
ఇందుకోసం అతడు మెంబర్‌షిప్ స్కీమ్ లో కూడా చేరాడు. ఈ ఫథకంలో నెలకు 22 డాలర్లు చెలిస్లే చాలు ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు చూడవచ్చు. గిన్నిస్ రికార్డ్స్ వారి నిబంధనల ప్రకారం, ఈ రికార్డు నెలకొల్పేందుకు అభ్యర్థులు సినిమాను మొత్తం మొదటి నుంచి చివరి వరకు చూడాల్సి ఉంటుంది. అంతేకాదు థియేటర్‌లో సినిమా నడుస్తుండగా మొబైల్ చూసుకోవడం, లేదా చిన్న కునుకు తీయడం వంటివి అస్సలు చేయకూడదు. జాక్ ఈ నిబంధనలు ఫాలో అవుతున్నాడో లేదో సినిమా హాల్ వాళ్లే పర్యవేక్షించారు. అయితే ఈ రికార్డు కోసం జాక్ నిమిషం కూడా వదలకుండా సినిమా మొత్తం చూసేవాడు. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే వీడెవడో ఖాళీగా ఉన్నాడు అందుకే అన్ని సినిమాలు చూశాడు అనుకుంటే పొరపాటే. జాక్ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జాజ్ చేసి ఆ తరువాతే సినిమాలు చూసేవాడు. అలా రోజుకు సరాసరి మూడు సినిమాలు, వీకెండ్ లో ఇంకా ఎక్కువ సినిమాలు చూస్తూ ఈ రికార్డును నెలకొల్పాడు.