ఆస్ట్రేలియాలో అత్యధికంగా టాటూలు వేయించుకున్న యువతి ఇప్పుడు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ముఖం, శరీరం, కళ్ళను కూడా కప్పి ఉంచే టాటూల కోసం దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ ఐస్ వైట్ డ్రాగన్‌గా పిలువబడే అంబర్ లూక్, తన అద్భుతమైన బాడీ ఆర్ట్‌కు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఆమె శరీరం అంతటా దాదాపు 600 టాటూలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ తొలగిస్తోంది.
Also Read:GST Reforms Success: జీఎస్టీ సంస్కరణలు.. 99% వస్తువులు 5 శాతానికి తగ్గింపు..
స్కై న్యూస్ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల మహిళకు 16 సంవత్సరాల వయసులో బాడీ డిస్మోర్ఫియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో తన రూపం పట్ల తనకే అసహ్యం వేసింది. ఆ సమయంలో, ఆ పాఠశాల విద్యార్థిని తనను తాను మానసికంగా, శారీరకంగా గర్వించదగిన వ్యక్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. లూక్ 22 సంవత్సరాల వయసులో తన కళ్ళపై టాటూ వేయించుకుంది. దీని వల్ల ఆమె మూడు వారాల పాటు కంటి చూపును కోల్పోయింది. తల నుండి కాలి వరకు టాటూల కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేసింది.
ల్యూక్ చర్మం ఒకప్పుడు స్పష్టంగా, మెరుస్తూ ఉండేది. ఒకప్పుడు పూర్తిగా నీలిరంగుతో ఉన్న ఆమె కళ్ళు ఇప్పుడు ముదురు గోధుమ రంగులో ఉన్నాయి. జైలు శిక్ష తర్వాత తన బరువులో హెచ్చుతగ్గుల కారణంగా తన ముఖ పచ్చబొట్లు మసకబారాయని ల్యూక్ తెలిపింది. శరీర బరువులో హెచ్చుతగ్గులు, పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని దీని కారణంగా టాటూలను తొలగిస్తున్నట్లు తెలిపింది.
Also Read:Chicken leg piece: ముక్క కోసం ఆ మహిళ ఎంత పని చేసిందంటే….
2021లో, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత, లూక్‌కు బ్రిస్బేన్ జిల్లా కోర్టులో ఉపశమనం లభించింది. కాగా ఆమె తన ముఖాన్ని మళ్ళీ మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 10 సంవత్సరాలలో మొదటిసారిగా 30 సంవత్సరాల వయసులో నా పాత ముఖాన్ని చూడటానికి నేను హృదయపూర్వకంగా ఉత్సాహంగా ఉన్నాను” అని లూక్ చెప్పింది.