GST Reforms Success: విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ట్యాక్స్ లు కొన్ని సెక్షన్లకు మాత్రమే వర్తిస్తే.. కానీ, జీఎస్టీ 140 కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపిస్తుందన్నారు. జీఎస్టీ 2.O అమలులోకి రాక ముందే ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పని చేస్తుంది అని తెలియజేసింది. విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించింది.
అయితే, 12 శాతం ట్యాక్స్ విధానంలో ఉన్న 99 శాతం ప్రొడక్ట్స్ 5 శాతంలో కి వచ్చేస్తాయని కేంద్రమంత్రి నిర్మలా తెలిపింది. 2017కు ముందు జీఎస్టీ ట్యాక్స్ పేయర్లు 66 లక్షల మంది 1.51 లక్షల మందికి ఈ 8 ఏళ్లలో పెరిగారు.. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అక్షేపించినా వినియోగదారులకు అంతిమంగా మేలు జరుగుతుంది.. వన్ నేషన్- వన్ ట్యాక్స్ విధానానికి జీఎస్టీ కౌన్సిల్ ఫెడరల్ వ్యవస్థగా మారింది.. న్యూజెన్ ట్యాక్స్ వల్ల రెండ లక్షల కోట్ల వరకు ప్రజల చేతుల్లో నగదు ఉంటుంది.. పప్పులు, ఉప్పులు సహా అన్నీ 5 శాతం పరిధిలోకి వచ్చేశాయ్ అని వెల్లడించింది. జీఎస్టీ 2.O స్థూలంగా మధ్య తరగతికి మేలు చేసే విధంగా రూపొందించాం.. పేద, మధ్య తరగతి, రైతులు, MSMEలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్స్ ను పిల్లర్స్ గా పెట్టుకుని జీఎస్టీ రూపకల్పన జరిగింది అని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొనింది.
Read Also: Minister Payyavula: ఎక్కడ ఖర్చు పెట్టాలో కాదు, ఎక్కడ నియంత్రించాలో తెలిసిన వ్యక్తి నిర్మలా సీతారామన్
ఇక, 144 వందే భారత్ రైళ్లు, 60 శాతం కంటే ఎక్కువ హైవేలు, విమానాశ్రయాలు రెట్టింపుతో పాటు సంక్షేమ పథకాలు, రక్షణ వ్యవస్థ బలోపేతం ఇవన్నీ జీఎస్టీ సొమ్ముతోనే చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మన డబ్బుని సరిగ్గా వినియోగించే ప్రభుత్వం మనకి కావాలి.. డీబీటీల ద్వారా రూ.3 లక్షల కోట్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేశాం.. జీఎస్టీ 2.0 తీసుకొస్తే ఎనిమిదేళ్లు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసినట్లు ఒప్పుకుంటున్నారా అని ప్రతిపక్షాలు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లు జీఎస్టీని తీసుకురాకుండా కాలయాపన చేసిన యూపీఏ ప్రభుత్వానికి జీఎస్టీపై మాట్లాడే అర్హత లేదు అన్నారు. వాళ్ల గురించి మాట్లాడాలంటే బూతులొస్తున్నాయి.. రాజకీయంగా బదులిచ్చేందుకు సమయం ఉంది.. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లపై యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం ఉంటే ఇప్పుడు 18 శాతానికి తగ్గిందని నిర్మలా సీతారామన్ తెలియజేసింది.