రాష్ట్రంలో స్పోర్ట్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం జగన్ చెప్పారని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఇవాళ గుంటూరులో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అంబటి రాయుడు.. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమీ లని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు పుట్టిన జిల్లా కావడంతో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నానని ఆయన తెలిపారు. రానున్న కాలంలో రాజకీయాల వైపు అడుగులు వేస్తానని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Kethika Sharma : బ్రో సినిమా ద్వారా మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసాను..
ఇదిలా ఉంటే.. ఇటీవల తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని స్పష్టం చేస్తూనే ఎక్కడి నుంచి పోటీ లేదంటూ వెల్లడించారు. అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు ఆహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఐపీఎల్ జట్టు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌కూ బైబై చెప్పాడు. అయితే తన మనుసులోని మాటను వెల్లడించకుండానే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అక్కడి సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే.. ఇవాళ రానున్న కాలంలో రాజకీయాల వైపు అడుగులు వేస్తానని అంబటి రాయుడు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Modi America Visit Effect: ఇండియాకు చేరనున్న 105 పురాతన కళాఖండాలు..