పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహిస్తుంది.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా కేతిక శర్మ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. కేతికా శర్మ మాట్లాడుతూ బ్రో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ అంటూ టక్కున సమాధానం చెప్పేసింది కేతికా శర్మ. ఆయన పేరు వింటే చాలు..సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు ఏమి అవసరం లేదు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఆయనతో కలిసి బ్రో సినిమా లో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అంతకముందు ఎప్పుడూ కూడా నేను కలవలేదు.మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది అని ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది కేతికా శర్మ. ఇందులో ఆమె సాయి ధరమ్ తేజ్ కు ప్రేయసి గా కనిపించబోతున్నట్లు చెప్పుకొచ్చింది.అలాగే ఈ మూవీ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని తెలిపింది. ఇలాంటి సినిమాల లో నటించే అవకాశం రావడం తనకు ఇదే మొదటిసారి అని ఆమె స్పష్టం చేసింది. తన గత చిత్రాల కన్నా ఈ సినిమా ఎంతో విభిన్నంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అందరికి బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది.