Ambati Rambabu Slams TDP:164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు.. లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన హోం మంత్రి ఆ పని చేయటం లేదు.. హోం మంత్రి జగన్ విషయాలు మాట్లాడటం, తిట్టే కార్యక్రమాలు మాత్రమే చేస్తుందని రాంబాబు ఫైర్ అయ్యారు..
READ MORE: KA Paul : బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో బెట్టింగ్ యాప్స్ కేసు
తల్లి, చెల్లి వాటాల గురించి చెప్తుంది.. మీ కుటుంబం గురించి మాకు తెలియదా అని రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చెక్స్ కేసులో మీరు కోర్టులకు వెళ్లలేదా?
మీరు ఇష్టానుసారం పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.. రాజధాని, పోలవరం నిర్మాణం సంగతి మర్చిపోయారని మండిపడ్డారు.. తమ మంత్రి వర్గంలో ఉన్నవాళ్ళు జైళ్లకు పంపుతున్నారు.. అయితే ఏమవుతుంది.. రేపు మావాళ్ళు అధికారంలోకి వచ్చాక మా వాళ్ళు ఇదే చేయమంటారు కదా..? అన్నారు.. కొంతమంది ఐపీఎస్ అధికారులపై టీడీపీ అధికారంలోకి అక్రమ కేసులు పెట్టిందని.. మీరేమీ అతీతులు కాదన్నారు. రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని..
నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు.. లోకేష్ ఇప్పుడు హై క్యాష్.. అధికారం మూన్నాళ్ళ ముచ్చట అని తెలుసుకోవాలన్నారు..
READ MORE: Breast Cancer in Women: మహిళలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి.? ఈ లక్షణాలు ఉంటే కన్ఫార్మ్!
“ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళను ఇష్టానుసారం మాట్లాడారని మీ అభియోగం.. ఆయన మీద కేసులు పెట్టారు కదా.. ఎందుకు దాడి చేశారు.. మా నాయకుడ్ని మేం పరమర్శకు తప్పేంటి. వాళ్ళు నేరారోపణ చేయబడిన వ్యక్తులు తప్ప నేరస్తులు కాదు.. ఆ లెక్కకు వస్తే చంద్రబాబు కూడా జైళ్లో ఉన్నారు.. చిట్టినాయుడు పిట్ట కథలు గతంలో పర్యటనల సందర్భంగా చాలా విన్నాం.. ఈశ్వర్ కు వీళ్లకు జరిగిన లావాదేవీలపై సెటిల్మెంట్ కోసం సింగపూర్ వెళ్ళారు.. డౌట్ ఉంటే కనుక్కోవాలి.. డిస్ట్రిలరి కంపెనీ లు ఏమి కొనుక్కుంటే ఎవరికి సంబంధం.. కట్టుకదలతో వైసీపీ వాళ్లను వేధిస్తున్నారు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలులో ఉన్న సమయంలో ప్రజాధారణకు ఇప్పుడు ఉన్న ప్రజాదరణకు చాలా తేడా ఉంది.. జగన్ పర్యటనల సమయంలో జనం వచ్చిన విజువల్స్ చూపించాల్సిన అవసరం లేదు.. విజువల్స్ మార్ఫింగ్ చేయాల్సిన దుస్తితి మాకు లేదు.. జనం రాకపోతే అసలు లాఠీఛార్జ్ ఎందుకు చేశారు.. హోం మంత్రి గారు సమాధానం చెప్పాలి.. వాళ్ళు ఎంత కట్టడి చేస్తే అంత జనం వస్తున్నారు.. చంద్రబాబు మా తోకలు కట్ చేయటం కాదు.. మా తోకలు జనం కట్ చేశారు.. మీ తోకలు కట్ చేయకుండా చూసుకోండి.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మీద ఎన్ని మాటలు చెప్పినా నమ్మరు.. గతంలో వైఎస్ మీద ఇప్పుడు జగన్ మీద వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు.. టీడీపీ హయాంలో మామీద పెట్టిన కేసులు ఒక్కటి నిలబడ్డా నన్ను అడగండి.. ఒక్క కేసు కూడా నిలబడదు..” అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
