కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పోస్టల్ లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ ప్రకారం 30041 గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఈ పోస్ట్ లకు అర్హత కేవలం పదవ తరగతి పాస్ కావడమే. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 23 లోగా ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 26 వరకు తమ అప్లికేషన్ లో తప్పొప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేకొనే వాళ్ళు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 వతరగతి పాస్ అయిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అర్హులు. అయతే, వారు 10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్, స్థానిక భాష కచ్చితంగా చదివి ఉండాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ విమన్, దివ్యాంగులు అప్లికేషన్ ఎటువంటి ఫీజు చెల్లించనక్కర లేదు..
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
హోం పేజీపై కనిపిస్తున్న registration లింక్ పై క్లిక్ చేయాలి.
వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..
ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..