NTV Telugu Site icon

Ambati Rambabu: ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తారు?.. సెటైర్లు వేసిన అంబటి రాంబాబు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు. లోకేష్ బయటకు వచ్చి మాట్లాడడు.. ప్రతి దానికి పవన్ వస్తారంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. చెడు ఉంటే పవన్ వస్తారు.. అది పక్కకి పోతుందన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న ఇదంతా నడిచినంత సేపు నడుస్తుందంటూ విమర్శించారు.

చంద్రబాబు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఎన్నికల్లో హామీలు ఇచ్చారని.. ఏ హామీ నెరవేర్చక ప్రజల్లో వ్యతిరేకత పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అందులో భాగమే ఇటీవల తిరుమల లడ్డు కల్తీ ప్రచారమంటూ ఆయన అన్నారు. ఇప్పుడు తాజాగా కాకినాడ పోర్టు కొనుగోలు ఒప్పందాలపై చేస్తున్నారన్నారు. ఏపీలో చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.

Read Also: Minister BC Janardhan Reddy: సంక్రాంతిలోగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తాం..

పవన్ సీజ్ ది షిప్ అంటే అది అవలేదని.. పవన్‌ను ఎంత చక్కగా ఉపయోగించాలో అంత చక్కగా చంద్రబాబు ఉపయోగిస్తున్నారన్నారు. కాకినాడ సీ పోర్ట్ విషయంలో పవన్ ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. గతంలో కేవీ రావుకు చంద్రబాబు పోర్ట్ అప్పగించారు అని చెప్పిన పవన్ ఎందుకు వెళ్ళారంటూ ప్రశ్నలు గుప్పించారు. సీజ్ ది షిప్ అనేది కామెడీ డైలాగ్ అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే షిప్ సీజ్ అనేది రాష్ట్ర పరిధిలో లేదన్నారు. బియ్యం దగ్గర చీమల మాదిరి పవన్‌ను చంద్రబాబు పంపారన్నారు. పీడీఎస్ రైస్‌లో వాటాలు అందని టీడీపీ ఎమ్మెల్యే ఎవరు చెప్పాలన్నారు. పయ్యావుల కేశవ్ వియ్యంకుడు చేసేది బియ్యం రవాణానే అని ఆయన అన్నారు. ప్రభుత్వం చెక్ చేయకుండా మాకు చెక్ పోస్ట్ ఇస్తానని చెప్పటం వెనుక అర్థం ఏంటని ప్రశ్నించారు. మేం చెక్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. ఇందులో జగన్, సుబ్బారెడ్డి కుమారుడు, విజయ్ సాయిరెడ్డి పాత్ర ఉందని అసత్య ప్రచారం చేయిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.