విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడని క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. కింగ్ కోహ్లి భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే టాప్ ఫీల్డర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ.. అద్భుతంగా మైదనమంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాడు. రేపు ప్రారంభమయ్యే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. అయితే కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో తాను చాలా లాంగ్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూస్తే విరాట్ కోహ్లీని సూపర్‌మ్యాన్ అని పిలువవచ్చు.
TPGL: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్, సీజన్ 3 మొదలైంది!
ఈ వీడియోలో విరాట్ కోహ్లీ ఖాళీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చూడవచ్చు. అతను క్యాచ్ పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా వేగంగా కదులుతున్న బంతిని పట్టుకోవడానికి లాంగ్ డైవ్ చేస్తాడు. బంతి అతని చేతుల్లోకి వెళ్లినప్పటికీ, కోహ్లి చేసిన ప్రయత్నాలు పూర్తిగా టాప్ క్లాస్‌గా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో శరవేగంగా షేర్ అవుతోంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగులు చేశాడు. అయితే ప్రపంచకప్‌లో కోహ్లి ఫామ్ లో ఉండటం భారత్‌కు ఎంతో కలిసొచ్చే అంశం.
Air India: ఇజ్రాయిల్‌కి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా..
ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8(రేపు) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనుంది. మూడో మ్యాచ్‌లో టీమిండియా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్‌తో తలపడనుంది.
Virat Kohli – The Superhuman…!!!!
King Kohli always gives his everything in every moments – The GOAT. pic.twitter.com/1yr5q9u6pE
— Tanuj (@ImTanujSingh) October 7, 2023