20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazfit Bip Max Smartwatch launch: అమేజ్‌ఫిట్ (Amazfit) నుండి కొత్తగా బిప్ మాక్స్ (Bip Max) స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన Bip 6కు కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త మోడల్లో పెద్ద డిస్ప్లే, మెరుగైన బ్రైట్నెస్, అధునాతన ఫిట్నెస్ ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది.
Amazfit Bip Maxలో 2.07 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 432 x 514 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వచ్చే ఈ స్క్రీన్ గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. దీంతో ఎండలో కూడా డిస్ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో లాంచ్ అయ్యింది. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ సాయంతో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ లభిస్తుంది. అలాగే 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో 50 మీటర్ల లోతు వరకు నీటి నిరోధకతను అందిస్తుంది.
Also Read
- 6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
ఫిట్నెస్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఇందులో 150కిపైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. HYROX, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి అనేక వర్కౌట్ మోడ్లు ఇందులో ఉన్నాయి. Zepp Coach ఆధారిత AI కోచింగ్ సిస్టమ్ వినియోగదారులకు వ్యక్తిగత శిక్షణ సూచనలను అందిస్తుంది. అలాగే 25 స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మూవ్మెంట్లు, 8 క్రీడా కదలికలను ఆటోమేటిక్‌గా గుర్తించే స్మార్ట్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది.
హెల్త్ మానిటరింగ్ కోసం BioTracker 6.0 PPG బయోమెట్రిక్ సెన్సార్‌ను అమర్చారు. ఇది 24 గంటల హార్ట్‌రేట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయి (SpO2), ఒత్తిడి (Stress) స్థాయిలను పర్యవేక్షిస్తుంది. ఒకే ట్యాప్‌తో ఆరోగ్య కొలతలను తెలుసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇందులో బిల్ట్-ఇన్ GPSతో పాటు GPS, GLONASS, GALILEO, QZSS సహా ఐదు శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లకు మద్దతు ఉంది. అలాగే 4GB స్టోరేజ్‌తో ఆఫ్‌లైన్ మ్యూజిక్, మ్యాప్స్‌ను కూడా సేవ్ చేసుకోవచ్చు.
బ్యాటరీ విషయానికి వస్తే.. 550mAh బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో గరిష్టంగా 20 రోజుల బ్యాటరీ లైఫ్, హెవీ యూజ్‌లో 10 రోజుల బ్యాటరీ బ్యాకప్, నిరంతర GPS వినియోగంలో 40 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ సిల్వర్ రంగులో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.10,999గా నిర్ణయించారు. ప్రస్తుతం అమెజాన్, Amazfit అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!