పుష్ప2తో టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్ట్స్ కూడా ఈ లెవల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్ ఫిక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్.
Also Read : Power star : పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై భూమిక కామెంట్స్
బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక బాలీవుడ్, మాలీవుడ్ దర్శకులతో ఐకాన్ స్టార్ వర్క్ చేయబోతున్నాడన్న టాక్ మధ్య మళ్లీ కోలీవుడ్ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చి షాకిచ్చాడు అల్లు అర్జున్. డైరెక్టర్ లోకేష్‌ని అక్కడి స్టార్ హీరోలు కాదంటుంటే.. బన్నీ మాత్రం కావాలంటున్నాడు. లోకేష్ కథ చెప్పి ఇంప్రెస్ చేయడంతో ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేయడం టకా టకా జరిగిపోయాయి. కోలీవుడ్ దర్శకుల్ని బన్నీ సెట్ చేయడానికి రీజన్.. తమిళ తంబీలకు చేరువయ్యేందుకు, అక్కడి బాక్సాఫీస్ రూల్ చేసేందుకు. రజనీ, కమల్ సీనియర్స్ కావడం.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ, అజిత్ కార్ రేస్ అంటూ గడిపేస్తుండటంతో అక్కడ స్టార్ హీరో ప్లేస్ ఖాళీ అయ్యింది. దీన్ని ఫిల్ చేసేందుకే తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఈ స్ట్రాటజీలో భాగమే అట్లీ, లోకీ లాంటి స్టార్ దర్శకుల్ని సెట్ చేశాడు. అలాగే అక్కడి హీరోలు ఇక్కడి మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అవుతుంటే.. మన హీరోలు తమిళ ఇండస్ట్రీలో పాగా వేయలేకపోవడాన్ని కూడా ఛాలెంజ్‌గా తీసుకున్నట్లే కనిపిస్తోంది.
తమిళ దర్శకుల్ని కాదు.. టాలీవుడ్‌లో హ్యాండిచ్చాడు అనుకున్న త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్స్ కూడా లైన్లోనే ఉన్నాయన్నది టాక్. గురూజీ గాడ్ ఆఫ్ వార్ మళ్లీ బన్నీ చేతికే వచ్చిందని సమాచారం. అలాగే సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్ట్ డిస్కర్షన్ జరగ్గా.. అదీ కూడా ఆన్ కార్డ్స్ అంటూ రీసెంట్లీ హింటిచ్చారు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. స్పిరిట్, యానిమల్ పార్క్ కంప్లీట్ కాగానే బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందట. వీటికి తోడు పుష్ప3 ఉండనే ఉంది.