Unstoppable : బాలయ్యతో పుష్పరాజ్.. గుక్క తిప్పుకోకుండా పద్యం చెప్పిన అల్లు అర్హ
- బాలయ్యకు షాకిచ్చిన అల్లు అర్జున్ కూతురు
- నవంబర్ 22న స్ట్రీమింగ్ కు పుష్ప రాజ్ సెంకడ్ ఎపిసోడ్
- ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసిన ఆహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్లో అనేక అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ని మొత్తం రెండు పార్టులుగా ప్లాన్ చేయగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ తాలూకా డేట్ ని ఆహా వారు ప్రకటించారు. ఈ ఎపిసోడ్ ని ఈ నవంబర్ 22న స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. దీనిపై ప్రోమోను కూడా ఇపుడు విడుదల చేశారు. ఈ ప్రోమో కూడా అదిరిపోయింది అని అంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలు హాజరు అయి షోకు ఎట్రాక్షన్ తీసుకొచ్చారు.
Read Also:Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
Also Read
మరి ఇందులో అల్లు అర్హ మాత్రం అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ.. అర్హ నీకు తెలుగు వచ్చా.. అని అడిగేసరికి అర్హ.. పదో క్లాస్‌లో చాలామంది చదువుకున్న ‘అటజనికాంచె భూమిసురు డంబరచుంబి..’ అనే పద్యాన్ని ఆపకుండా అవలీలగా చెప్పేసింది. దీంతో అర్హ టాలెంట్ కు బాలయ్య బాబు ఫిదా అయిపోయాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇదే ప్రోమోలో వ్యక్తిగత విషయాలతో పాటు త్వరలో రాబోతున్న ‘పుష్ప 2’ గురించి అల్లు అర్జున్-హోస్ట్ బాలకృష్ణ మాట్లాడుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా ఫోన్ చేసి మూవీ గురించి మాట్లాడారు. చివరలో బన్నీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాస్ చూశారు, ఊరమాస్ చూశారు.. ‘పుష్ప 2’తో జాతర మాస్ చూస్తారని ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. నవంబర్ 22 శుక్రవారం రోజున ఈ ప్రోమో తాలూకూ ఫుల్ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ 22న వచ్చే ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు సాలిడ్ ప్రాజెక్ట్ “డాకు మహారాజ్” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానుల్లో ఓ రేంజ్ లో హైప్ నెలకొంది.
Read Also:Baaghi4 : బాబోయ్ టైగర్ ష్రాఫ్.. సీక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు
Part 1 tho Jathara chupinchamu , Part 2 Tho jathara mass chustaru 🥵.
Get ready to watch Wildfire episode from Nov 22.#Unstoppable #iconstar #AlluArjun𓃵 #Ayaan #arha #UnstoppableWithNBK #AlluArjunOnAha #Pushpa2TheRule #DaakuMaharaaj #WildFire #Fahadfaasil #Rashmika… pic.twitter.com/nCksm5gzZH
— ahavideoin (@ahavideoIN) November 19, 2024
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!