Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది, ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటేనే మెగాస్టార్ సినిమా ఇచ్చే జోష్ వేరు, దశాబ్దాలుగా తన బాక్సాఫీస్ స్టామినాతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేశారు. ఈ సినిమా సాధిస్తున్న భారీ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.
READ ALSO: NSPG Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.15 వేలు మీ అకౌంట్‌లోకే.. అస్సలు వదులుకోవద్దు!
అల్లు అర్జున్ తన ట్వీట్‌లో చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్‌ను కొనియాడారు, “బాస్ ఈజ్ బ్యాక్.. స్క్రీన్‌పై మెగాస్టార్ గారిని మళ్ళీ ఆ వెలుగులో చూడటం చాలా ఆనందంగా ఉంది. పక్కా వింటేజ్ వైబ్స్ కనిపిస్తున్నాయి” అంటూ ఆయన తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ తనదైన కామెడీ టైమింగ్ మరియు గ్రేస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంపై బన్నీ ఆనందం వ్యక్తం చేశారు, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు పోషించిన ‘వెంకీ గౌడ’ పాత్ర గురించి ప్రస్తావిస్తూ, ఆయన షోని రాక్ చేశారని అల్లు అర్జున్ ప్రశంసించారు. అలాగే కథానాయిక నయనతార తన హుందాతనంతో, క్యాథరిన్ ట్రెసా తన హాస్యంతో మెప్పించారని పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్రాంతి స్టార్ ‘బుల్లిరాజు’ (రేవంత్) ఎనర్జీ సినిమాకు పెద్ద ఎసెట్ అని కొనియాడారు.
సినిమాలోని పాటలు, ముఖ్యంగా #HookStep, #MegaVictory వంటి సాంగ్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయని బన్నీ పేర్కొన్నారు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోకు, నిర్మాతలు సుష్మిత కొణిదెల, సాహు గారపాటికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన సోదరి సుష్మిత నిర్మాతగా సాధించిన ఈ విజయం పట్ల ఆయన గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడిని అల్లు అర్జున్ “బ్లాక్‌బస్టర్ మెషిన్” అని అభివర్ణించారు. “సంక్రాంతికి వస్తారు – హిట్ కొడతారు – రిపీటు” అంటూ అనిల్ రావిపూడి సక్సెస్ రేటును ప్రశంసించారు. చివరగా ఈ సినిమా కేవలం ఒక బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని, ఇది నిజమైన “బాస్”-బస్టర్ అని పేర్కొంటూ తన ట్వీట్‌ను ముగించారు.
READ ALSO: IND vs NZ T20 Records: మూడేళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. టీ20 రికార్డులు ఇవే!
