టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అట్లీ సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అనౌన్స్‌మెంట్ రాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్కా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పవర్‌ఫుల్ డాన్ చుట్టూ తిరిగే కథతో అట్లీ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Poonam Kaur : పోసాని కారణంగా.. నా సర్వస్వం కోల్పోయా – పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్.
ఈ చిత్రంలో ఒక కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను అట్లీ ఎంపిక చేసినట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్ పాత్ర సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, బన్నీ-టైగర్ కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్‌లో టైగర్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయంలోనూ అట్లీ భారీ తారాగణాన్ని లైన్‌లో పెట్టారు. ఇప్పటికే దీపికా పడుకోణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖ్యంగా వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మరిన్ని గెస్ట్ రోల్స్ కూడా ఉండబోతున్నాయట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.