Alleti Maheshwar Reddy : అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బీ అర్ ఎస్ అక్కడ కూర్చొందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరమని, రుణ మాఫీ కి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారన్నారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదని, సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారన్నారు. కానీ ఇందులో కోత విధించినట్లు తెలుస్తోందని, ఏ ప్రాతిపాదికన రైతులను ఎంపిక చేసారు ? అని ఆయన ప్రశ్నించారు. వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ఒప్పుకున్నారని, మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలని, ఈ ఏడాది రైతు బంధు పడలేదని, సీజన్ రైతు బంధు విడుదల చేయాలన్నారు. రైతు బందుకు , రైతు భరోసా కు వేర్వేరు నిధులు కేటాయించాలని, రైతు భరోసా పై అసెంబ్లీ లో చర్చ పెడతామని సీఎం చెప్పారని, చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’కౌలు రైతు ల గోస పట్టించుకునే నాథుడే లేడు. తెలంగాణలో దాదాపు 15 లక్షల కౌలు రైతు లు ఉన్నారు. వారు మీరిచ్చిన హామీతో మీకు ఓటేశారు. కౌలు రైతు లకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకోవాలి. పంట బోనస్ 500 ఇవ్వాలి. ఎన్నికల హామీలు భారేడు నిధులు మాత్రం జానెడు అనే విధంగా ఉంది. బడ్జెట్ అంకెల గారడీ గా ఉంది. వ్యవసాయానికి 49 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో 31 వేల కోట్ల ఇచ్చారు. కేసిఆర్ మాదిరిగానే సన్న బియ్యం కు బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటిలోగా ఇస్తారు ? రాష్ట్రంలో 7 నెలల్లో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత బీ అర్ ఎస్ ప్రభుత్వం రైతులను విస్మరించింది. అందుకే అక్కడ కూర్చున్నారు. భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు? భూ సర్వే తో నష్టపోయిన ఎంత మందికి మీరు న్యాయం చేశారు? రెవెన్యూ ట్రిబ్యునల్ కసరత్తు మొదలైందా? పేదల భూములు కేసిఆర్ లాక్కున్నారని. ఆ భూములు వెనక్కి తీసుకొని న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాటేమిటి ?.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
గులాబి పార్టీ ఎంఎల్ఏ లు లక్షల ఎకరాలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు ? ఆ లెక్క ఏమైనా తెలిసిందా? రాష్ట్రం ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్ భూమి ఉండే…. ఇప్పుడు 5 లక్షల మాత్రమే ఉంది. అవి ఎవరు లాక్కున్నారు ? దాన్ని లెక్క ఏమైనా తెలిసిందా? దానిపై ఎంక్వైరీ ఏమైనా వేశారా? దీనిపై సీబీఐ ఎంక్వైరీ కి సిద్ధమా? కాళేశ్వరం స్కాం ను సీబీఐ ఎంక్వైరీ కి ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ? ధరణి పోర్టల్ విదేశీ కంపెనీ అధీనంలో ఉంది. విదేశీ కంపెనీకి అప్పజెప్పెందుకు బాధ్యులు ఎవరు?. దీనిపై ఇప్పటి వరకు విచారణ చేయలేదు.దీని వెనకున్న మతలబు ఏమిటి? లక్షల ఎకరాల భూమిని బీ అర్ ఎస్ బాకాసురులు తింటే ఎందుకు ఎంక్వైరీ లేదు? ధరణి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు ? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి.’ అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!