బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమా ఓ మై గాడ్ 2.. ఈ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది. తాజాగా తెలుగు ఓటీటీ వర్షన్ విడుదలైంది..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ గత ఏడాది అక్టోబర్‌లోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తెలుగు వెర్షన్‌ను మాత్రం తొమ్మిది నెలల తర్వాత రిలీజ్ చేశారు.. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత ఏడాది ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. కథ కొత్తగా ఉండటంతో పాటుగా అక్షయ్ కుమార్ యాక్షన్ ప్రేక్షకులను బాగా మెప్పించింది..
ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ మూవీ కథ, కథనాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. దాంతో మేకర్స్ బాగా ఆలోచించి దేవదూతగా అక్షయ్ కుమార్ పేరును మార్చేశారు.. శివుడి గురించి ఈ సినిమా మొత్తం కథ ఉంటుంది. అనేక వివాదాలతో, అడ్డంకులు, వాయిదాలను దాటుకొని థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కమర్షియల్‌గా భారీ హిట్ ను సొంతం చేసుకుంది.. మొత్తంగా చూసుకుంటే సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది..