BabyTheMovie:సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు హిట్ అందుకుంటారు.. ఎవరు ప్లాప్ అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. అయితే ఎన్నో ఏళ్ల కష్టం ఒక్క సినిమాతో నిజమవుతుంది. అలా ఒక్క సినిమాతో స్టార్లు అయిన తారలు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం అందులో వైష్ణవి చైతన్య కూడా యాడ్ అయింది. యూట్యూబర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన వైష్ణవి.. బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే వైష్ణవి చైతన్య గురించే చర్చ జరుగుతుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రులుగా నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మూవీస్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు వైష్ణవి చైతన్య హైలెట్ గా నిలిచిందని చెప్తున్నారు. ఇంకోపక్క బేబీ సినిమాను ఆర్ఎక్స్ 100 సినిమాతో పోలుస్తున్నారు. హీరోను హీరోయిన్ మోసం చేసే పాత్రగా ఉండడంతో వైష్ణవిని ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ తో కంపేర్ చేస్తున్నారు. ఇందుకు చెల్లి దొరికేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇక్కడ వరకు ఓకే గాని పాయల్ లా వైష్ణవిని పోల్చి చూస్తే ఆమె కెరీర్ చిక్కుల్లో పడుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు.
Janhvi Kapoor: హా.. మాకు ఆ రోజా పూలే కావాలి
ఎందుకంటే.. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ కు ఒక్క సినిమా కూడా హిట్ వచ్చింది లేదు. ఇప్పటికి పాయల్ అలాంటి పాత్రలే చేస్తూ, అందాలను ఆరబోస్తున్నా విజయాలను మాత్రం అందుకోలేదు. ఇక పాయల్ లానే వైష్ణవి కూడా ముందు ముందు మంచి అవకాశాలను అందుకున్నా విజయాలను అందుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్న పాతుకుపోయిన సంప్రదాయం ప్రకారం ఎలాంటి రోల్ లో అయితే ఆమెకు హిట్టు పడిందో దాదాపు అలాంటి పాత్రలే ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. ఆ లెక్కన చూసుకుంటే వైష్ణవి చైతన్యకు ఇలాంటి పాత్రలే అందుతాయా అనే అనుమానం కూడా అభిమానుల్లో రేకెత్తుతుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వైష్ణవి ముందు ముందు విజయం అందుకోవడం కష్టమే అని చెప్పాలి. మరి వైష్ణవి మొదటి హిట్ ని కొనసాగిస్తుందా లేక పాయల్ లా మరో హిట్టు కోసం ఎదురుచూస్తుందా అనేది తెలియాల్సి ఉంది.