Shani Trayodashi: ఈ నెల 15వ తేదీన శని త్రయోదశి రాబోతోంది.. హైందవ సంప్రదాయం ప్రకారం- త్రయోదశితో కలిసి వచ్చిన శనివారాన్ని శని త్రయోదశిగా పిలుస్తారు. శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసంగా వస్తుంది.. అయితే, శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి.. స్నానం చేసుకుని.. దగ్గరలోని ఆలయానికి వెళ్లడం.. నవగ్రహాలకు ప్రత్యేక పూజలను చేయడం.. వగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం.. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం చేస్తుంటారు.. ఇక, శని త్రయోదశి నాడు శనీశ్వరుడి ఆలయాన్నే దర్శించుకుంటే మరి మంచిది.. అది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే ఆ శనీశ్వరుడి ఆలయం ఉంది..
Read Also: Subramanian Swamy: చంద్రబాబు, పవన్.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు..
శనైశ్చరుడు-ఆంజనేయుడు కలిసి ఉన్న మహిమాన్విత క్షేత్రం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉంది.. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది.. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్‌తో ప్రత్యేక సంబంధం ఉంది.. శనిసింగనాపూర్‌లో శనీశ్వరుడి పాదాల చెంత ప్రవహిస్తోన్న మూలానదిలోని మట్టిని, అక్కడి నుంచి తీసుకొచ్చిన రాతి విగ్రహాన్ని ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు.. ఇక, శని త్రయోదశి నాడు.. ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేస్తే.. శని బాధలు తొలగిపోతాయని పూరాణాలు చెబుతున్నాయి.. అయితే, ఖైరతాబాద్‌లో కొలువుదీరిన ఆ శనీశ్వరుడి ఆలయం ప్రత్యేకత.. శని త్రయోదశి నాడు ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..